ఖంగుతిన్న కివీస్

  • షై హోప్ కెప్టెన్ ఇన్నింగ్
  • కివీస్ కెప్టెన్ వీరోచిత పోరాటం వృధా

అక్లాండ్ లో న్యూజిలాండ్ కి వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టి20 మ్యాచ్ లో వెస్టిండీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 3 పరుగులు చేసి వెంటనే ఔట్ అవగా… కెప్టెన్ షై హోప్ 53 పరుగులతో( 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరవగా రోస్టన్ చేజ్ 28, రోవ్ మన్ పావెల్ 33 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో డఫ్ఫీ మరియు ఫౌల్క్స్ రెండేసి వికెట్లు మరియు కైల్ జెమీసన్, జేమ్స్ నీషమ్ ఒక్కో వికెట్ తీశారు.

           వెస్టిండీస్ నిర్ధేశించిన 164 పరుగులను చేధించే క్రమంలో ఆతిధ్య న్యూజిలాండ్ 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు రాబిన్సన్ 27 పరుగులు, రచిన్ రవీంద్ర 21 పరుగులు చేయగా డారిల్ మిషెల్ 13, జేమ్స్ నీషమ్ 11 పరుగులు మాత్రమే చేశారు.

కివీస్ కెప్టెన్ పోరాటం:

చివర్లో కివీస్ కెప్టెన్ మిషెల్ సాంట్నర్ 55( 28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు నాటౌట్ ) పరుగులు చేసి మెరుపులు మెరిపించినా కివీస్ ను ఓటమి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెస్టిండీస్ తరఫున జెడెన్ సీల్స్ మరియు రోస్టన్ చేజ్ మూడేసి వికెట్లు తీయగా మాథ్యూ ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, అఖిల్ హోసెన్ తలా ఒక్కో వికెట్ తీశారు. అయిదు టీ20ల మ్యాచ్ లో మొదటి టీ20 మ్యాచ్ గెలుపుతో వెస్టిండీస్ 1-0 తో ముందంజలో ఉంది.


Discover more from Jagamu

Subscribe to get the latest posts sent to your email.

Leave a Comment

Discover more from Jagamu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading